ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌.. ఏడుగురు మావోయిస్టులు మృతి

నారాయ‌ణ్‌పుర్ (CLiC2NEWS): ఛ‌త్తీస్‌గ‌డ్‌లో మ‌రోసారి ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుకు స‌మీపంలోని తెక్‌మేట అట‌వి ప్రాంతంలో న‌క్స‌ల్స్ ఉన్న‌ట్లు అందిన స‌మాచారం మేర‌కు స్కెష‌ల్ టాస్క్ ఫోర్స్ డిఆర్‌జి ద‌ళాలు సంయుక్తంగా ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. భ‌ద్ర‌తా సిబ్బందికి మావోయిస్టుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఎదురు కాల్పుల‌లో ఏడుగురు న‌క్స‌ల్స్ ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం. 15 రోజుల వ్య‌వ‌ధిలో ఈ ప్రాంతంలో ఇది రెండ ఎన్‌కౌంట‌ర్. సోమ‌వారం రాత్రి నుండి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్ట‌గా.. మంగ‌ళ‌వారం మ‌వోయిస్టులు ఉన్న ప్రాంతానికి చేరుకుని కాల్పులు జ‌రిపారు. మ‌ర‌ణించిన వారిలో ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రికొంద‌రు న‌క్స‌ల్స్ ప‌రార‌య్యారు,.

Leave A Reply

Your email address will not be published.