అక్టోబర్‌లో మరో గ్రూప్-1, 2025లో గ్రూప్-2.. జాబ్ క్యాలెండర్

హైదరాబాద్ (CLiC2NEWS): అక్టోబర్‌లో మరో గ్రూప్-1 నోటిఫికేషన్ రానుంది. అదేవిధంగా గ్రూప్-2, 3 , కానిస్టేబుల్, ఎస్ ఐ , ఉపాధ్యాయ ,అధ్యాపక పోస్టులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. వీటికి సంబంధించిన ఉద్యోగాల సంఖ్య, ఇతర వివరానలు ఉద్యోగ ప్రకటన (నోటిఫికేషన్) లో వెల్లడించనుంది. యుపిఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరహాలో ఈ క్యాలెండర్‌ను తెలంగాణ సర్కార్ రూపొందించింది.
రాష్ట్రంలో కొత్త సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షలు జరిగాయి. ప్రధాన పరీక్షలు కూడా యథావిధిగా నిర్వహిస్తారు. ప్రధాన పరీక్షల సమయంలో మరో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడనున్నది. జిఒ నం. 55లోని 19 ప్రభుత్వ విభాడాలు, తత్సమాన స్థాయి పోస్టులతో పాటు అటవీ విభాగంలోని సహాయ కన్జర్వేటర్ (ఎసిఎఫ్) పోస్టులను వీటిలో చేర్చనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2025 మే నెలలో గ్రూప్-2 , జులైలో గ్రూప్-3 నోటిఫికేషన్‌లు వెలువడనున్నట్లు జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు. గ్రూప్-4 ఉత్యోగాలను గ్రూప్-3తో కలిపి నిర్వహించనున్నారు. ఏడాది రెండు టెట్ నోటిఫికేషన్లు నిర్వహించనున్నట్లు ఉద్యోగ కాలెండర్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి నోటిఫికేషన్ ఈ ఏడాది నవంబర్‌లో, రెండవది 2025 ఏప్రిల్‌లో వెలువడుతుంది.
జాబ్ క్యాలెండర్: