రాష్ట్రంలో మరో 1,326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మరో 1,326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వైద్యారోగ్య శాఖలో 1,326 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కుటుంబ సంక్షేమశాఖలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, వైద్య విద్య డైరెక్టరేట్‌లో 357 ట్యూటర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 211 సివిల్ సర్జన్ జనరల్, ఐపిఎంలో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 15వ తేది నుండి ఆగస్టు 14 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది.