Tokyo Olympics: భార‌త్‌కు మ‌రో మెడ‌ల్ ఖాయం..

సెమీస్‌కు బాక్స‌ర్ ల‌వ్లీనా

టోక్యో (CLiC2NEWS): ఒలింపిక్స్‌లో బాక్స‌ర్ మ‌రో ప‌త‌కం ఖాయ‌మైంది. యువ బాక్స‌ర్ లవ్లీనా బోర్గోహెన్ స‌మీస్‌కు దూసుకెళ్లి చ‌రిత్ర సృష్టించింది. శుక్ర‌వారం హోరాహోరీగా సాగిన క్వార్ట‌ర్స్ పోరులో చైనీస్ తైపీకి చెందిన మాజీ ఛాంపియ‌న్ నీన్‌-చిన‌న్‌పై 4-1 తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 64-69 కేజీల విభాగంలో అద్భుత‌మైన విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో ఆమె సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది. బాక్సింగ్ సెమీస్ ఫ‌లితంతో సంబంధం లేకుండా ఇండియాకు మ‌రో మెడ‌ల్ ఖాయం. సెమీస్‌లో ఒక‌వేళ ల‌వ్లీనా ఓడినా.. బ్రాంజ్ మెడ‌ల్ మాత్రం ఖాయం.

ఎలింపిక్ క్రీడ‌ర్లో బాక్సింగ్ విభాగంలో భార‌త్‌కు ప‌త‌కం అందిస్తున్న మూడో బాక్స‌ర్ లవ్లీనానే కావ‌డం విశేషం. అంత‌కు ముందు 2008లో విజేంద‌ర్‌, 2012లో మేరేకోమ్ ఒలింపిక్ ప‌త‌కం సాధించారు. వీరిద్ద‌రికీ కాంస్యాలే ద‌క్కాయి.
ఈ విజ‌యంపై ప‌లువురు ప్ర‌ముఖులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కేంద్ర‌మంత్రి కిర‌ణ్ రిజిజు, అసోం సిఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ తిదిత‌రులు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమెను కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.