వాట్సాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌..!

WhatsApp : ఒక‌టే యాప్‌లో వేర్వురు అకౌంట్లు వాడుకునే స‌దుపాయం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఫోన్‌లో రెండు సిమ్‌లు ఉన్నా.. ఒకేసారి వాట్సా ప్ వాడుకోలేం. వేర్వేరు అకౌంట్లను ఒకే యాప్‌లో వాడుకునే వీలుంటే.. వాట్సాప్ ఈ స‌దుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఫ్యామిలీకోసం ఒక వాట్సాప్ అకౌంట్‌, ఆఫీసు అవ‌స‌రాల‌కు మ‌రో అకౌంట్.. ఇలా రెండు అకౌంట్లు వాడాల‌న‌నుకుంటే క్లోనింగ్ యాప్ త‌ప్ప‌నిస‌రి. అదే వాట్సాప్ తీసుకురాబోయే ఫీచ‌ర్ ద్వారా సింగిల్ క్లిక్‌తో అకౌంట్ల మ‌ధ్య స్విచ్ అవ్వొచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌ను మారిస్తే కావాల్సిన అకౌంట్‌తో వాట్సాప్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు.

వాట్సాప్ కొత్త‌గా విడుద‌ల చేసిన ఆండ్రాయిడ్ బీటా వెర్ష‌న్ 2.23.13.5లో ఈ ఫీచ‌ర్ క‌నిపించింది. వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్ప‌టిక‌ప్ప‌పుడు అందించే వాబీటా ఇన్ఫో ఈ ఫీచ‌ర్‌ను గుర్తించింది. ప్ర‌స్తుతం అభివృద్ది ద‌శ‌లో ఉన్న ఫీచ‌ర్ త్వ‌ర‌లో అందుబాలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.