TSLPRB: డిస్ క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల‌కు మ‌రో అవ‌కాశం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఫిజిక‌ల్ ఈవెంట్‌లో హైట్ విష‌యంలో ఒక సెంటీమీట‌ర్‌, అంత కంటే త‌క్కువ ఎత్తులో ఉండి డిస్ క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల‌కు టిఎస్ ఎల్ పిఆర్‌బి మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించ‌నుంది.  రాష్ట్రంలోని ఎస్ ఐ, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల ఫిజిక‌ల్ ఈవెంట్స్ ముగిసిన విష‌యం తెలిసిన‌దే. ఈ టెస్టుల్లో డిస్‌క్వాలిఫై అయిన అభ్య‌ర్థులు కోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు ఆదేశాల మేరకు టిఎస్ఎల్ పిఆర్‌బి.. 1 సెంటీ మీట‌ర్‌, అంత కంటే త‌క్కువ ఎత్తులో డిస్‌క్వాలిఫై అయిన వారికి మ‌రోసారి ఫిజిక‌ల్ ఈవెంట్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 10వ తేదీ ఉంద‌యం 8గంట‌ల నుండి 12వ తేదీ రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలు క‌ల్పించారు. అంబ‌ర్‌పేట పోలీస్ గ్రౌండ్, కొండాపూర్ 8వ బెటాలియ‌న్‌ల‌లో ఈవెంట్స్ నిర్వ‌హిస్తారు. అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తుతో పాటు అడ్మిట్‌కార్డు తీసుకుని రావాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.