TS: `దళిత బంధు`కు మరో రూ.500 కోట్లు విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం కోసం గురువారం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ సర్కార్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. కాగా నియోజకవర్గంలో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు ప్రభుత్వం ఈ నిధులను బదిలీ చేసింది.
కాగా ఇప్పటి వరకు దళితబంధు పథకం కోసం రాష్ట్ర సర్కార్ 4 విడతలుగా రూ. 1,500 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లతో కలిపి మొత్తం ఇప్పటి వరకు రూ.2 వేల కోట్లు రిలీజ్ అయ్యాయి. ఈ నిధులన్నీ హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు పథకం ద్వారా అందించనుంది.