‘ఖుషి’ నుండి మరో సాంగ్ రిలీజ్

హైదరాబాద్ (CLiC2NEWS): ‘ఖుషి’ చిత్రం నుండి మరో పాట రిలీజయింది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి సెప్టెంబర్ 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఎదకి ఒక గాయం.. అంటూ సాగే పాటను శివ నిర్వాణ రచించారు. ఈ పాటను స్వీయ సంగీత దర్శకత్వంలో హేషమ్ అబ్దుల్ వాహబ్, దివ్య ఎస్. మేనన్ ఆలపించారు.