AP: 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఎమ్మెల్సీలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు, రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్‌రాజు పదవులు చేపట్టనున్నారు. ఇవాళ సాయంత్రం తన శ్రీమతి వైఎస్ భారతితో కలిసి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ కోటాలో లేళ్ళ అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు పేర్లను సీఎం ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు.