AP: సివిల్ జడ్జి పోస్టులు

High Court of Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో 50 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టులు భర్తీ చేయనున్నారు. లా డిగ్రీ ఉత్తీర్ణులైన వారి నుండి సివిల్ జడ్డి పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థుల వయస్సు ఫిబ్రవరి 1, 2025 నాటికి 35 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు జనరల్, ఒబిసి, ఆడబ్ల్యుఎస్ అభ్యర్థులకు రూ. 1500. ఎస్‌టి, ఎస్‌సి అభ్యర్థులకు రూ.750 గా నిర్ణయించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 20వ తేదీ నుండి మార్చి 17వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. సివిల్ జడ్జి పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. సిలబస్ , పరీక్ష తేదీ.. తదితర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://aphc.gov.in/recruitment.html వెబ్‌సైట్ చూడగలరు.