AP: 55 సివిల్ జడ్జి పోస్టులు

అమరావతి (CLi2NEWS): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 55 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. `లా`(ఎల్ఎల్‌బి) డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. జూలై 1, 2021 నాటికి 35 సం. మించకూడదు. స్క్రీనింగ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది ఆగస్టు 20,2021.
స్క్రీనింగ్ టెస్ట్ :26.09.2021
పరీక్ష కేంద్రాలు: గఉగుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
పరీక్షా విధానం
స్క్రీనింగ్ టెస్ట్: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. దీనిలో 40శాతం, ఆపై మార్కులు సాధించిన వారిని 1:10 పద్ధతిలో రాతపరీక్షకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.
రాతపరీక్ష: ఇందులో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. 1. సివిల్ లా, 2. క్రిమినల్ లా, 3. ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్ టెస్ట్, ఎస్సే రైటింగ్ టెస్ట్ విభాగాలు ఉంటాయి. ప్రతి పేపర్‌ని 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్ పరీక్ష సమయం 3 గంటలు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని వైవా వాయిస్‌కు ఎంపికచేస్తారు. దీన్ని 50 మార్కులకు నిర్వహిస్తారు.