AP: బద్వేలు ఉపఎన్నికకు నామినేషన్‌ల స్వీకరణ

వైఎస్సార్ జిల్లా (కడప) (CLiC2NEWS) :ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు నియోజకరవర్గం ఉపఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా సబ్‌కలెక్టర్ కేతన్ గార్గ్ ఎలక్షన్ కమిషన్ నియమించింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నామినేషన్ల స్వీకరణ ఈనెల 8వ తేదీవరకు కొనసాగుతుంది. నామినేషన్ల పరిశీలనకు ఈనెల 11, ఉపసంహరణకు 18వ తేదీ వరకు సమయం ఉంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. వైకాపా ఎమ్మల్యే డా. వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో బద్వేలు ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసినదే.