AP: నెల్లూరు కార్పొరేషన్ వైఎస్ఆర్ సిపి కైవసం
100కు 97 మార్కులు వేశారు.. సిఎం జగన్ ట్వీట్

అమరావతి (CLiC2NEWS) : ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి అన్ని స్థానాల్లో గెలుపొందింది. కార్పొరేషన్‌లోని 46 డివిజన్లకు ఎన్నికలు ఈనెల 15 వతేదీన ఎన్నికలు నిర్వహించగా మొత్తం అన్నిడివిజన్లలో వైఎస్ ఆర్ సిపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇదివరకు ఏగ్రీవంగా ఎన్నికైన వారితో కలిపి మొత్తం 54 డివిజన్లను వైఎస్ ఆర్ సిపి కైవసం చేసుకుంది.
కుప్పం మున్సిపాలిటి వైఎస్ ఆర్ సిపిదే..
కుప్పం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డుల్లో వైఎస్ ఆర్ సిపి 19 స్థానాలను కైవసం చేసుకుంది. టిడిపి కేవలల ఆరు స్థానాలు మాత్రమే గెలుచుకుంది.
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ ఆర్ సిపి సాధించిన ఘన విజయానికి మంత్రి బొత్స సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వానికి ప్రజలు 97% మార్కులు వేశారు. ఇదంతా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన తీర్పు అని అన్నారు.
ఎన్నికల్లో సాధించిన విజయానికి సిఎం జగన్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, నగర పంచాయితీల్లో 100కు 97 మార్కులు వేశారు. అందరికీ ధన్యవాదాలు అనిట్వీట్ చేశారు.
దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు… ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 17, 2021