ఇవిఎంల ధ్యంసం చేసిన ఘటన.. మాచర్ల ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం..

అమరావతి (CLiC2NEWS): ఎపి పోలింగ్ జరిగిన రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్ర 202లో ఇవిఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేశారు. ఈ నియోజక వర్గంలో మరో ఏడు కేంద్రాల్లో ఇవిఎంలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటన జరిగి ఇన్ని రోజులైనా ఎమ్మెల్యేను ఎందుకు అరెస్టు చేయలేదని మండిపడింది. పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సిఇఒ ముకేశ్‌కుమార్ మీనాకు ఇసి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవ్యక్తులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపికి చెప్పాలని సిఇఒ ముకేశ్ కుమార్ మీనాను ఆదేశించింది.
పిన్నెల్లికి 7 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సిఇఒ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎపిలో మొత్తం 9 చోట్ల ఇవిఎంలు ధ్వంసం అయ్యాయని.. ఒక మాచర్లలో 7 చోట్ల ఇవిఎంలు ధ్యంసమైనట్లు వెల్లడించారు. ఈ ఘటన నమోదు అయిన సమయంఓల ఇసి ఆదేశాలతో బదిలీలు జరిగాయని.. ఇవిఎంల ధ్వంసం ఘటనలో మేమేమి దాచిపెట్లలేదన్నారు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఇవిఎంల ధ్యంసం ఘటనలను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించామన్నారు. మిషన్లు పాడైనా డేటా భద్రంగా ఉంది. దీంతో కొత్త ఇవిఎంలతో పోలింగ్ కొనసాగించామని సిఇఒ తెలిపారు.
[…] ఇవిఎంల ధ్యంసం చేసిన ఘటన.. మాచర్ల… […]