నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కి నెల జీతం విరాళంగా ఇచ్చిన ఎపి అసెంబ్లి స్పీకర్

అమరావతి (CLiC2NEWS): అంధ్రప్రదేశ్ అసెంబ్లి స్పీకర్ అయ్యన్న పాత్రుడు దేశ రక్షణ కోసం పోరాడుతున్న వీర జవాన్లకు సంఘీభావంగా తన ఒకన నెల వేతనం విరాళంగా ప్రకటించారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సాయుధ దళాలు పాక్ దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి. ఉగ్రవాద నిర్మూలనలో వారి ధైర్యసాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణమని స్పీకర్ అన్నారు. జాతీయ రక్షణ (నిధి నేషనల్ డిఫెన్స్ ఫండ్)కు తన నెల జీతం (రూ.2,17,000) విరాళంగా ప్రకటించారు. దేశ భక్తి గల పౌరులందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.