కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన ఎపి మంత్రివర్గం

అమరావతి (CLiC2NEWS): రాష్ట్రంలోని భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూమి కేటాయింపునకు ఎపి కేబినేట్ ఆమోదం తెలిపింది. ముఖ్మమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం కేబినేట్ సమావేశమైంది.
మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా వేపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీకి 1500 మెగావాట్ల పంపెడ్ స్టోరేజి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 454 కోట్ల పరిహారం ప్యాకేజి మంజూరుకు ఆమోదం తెలిపింది. సిఆర్‌డిఎ పరిధిలోని ఆర్5 జోన్‌లో 47 వేల ఇళ్ల నిర్మాణాలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు – మూల పేట పోర్టు నిర్మాణం కోసం రూ. 3,880 కోట్లు రుణాన్ని పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది.