AP: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిష‌న్ బిల్లుకు మంత్రివ‌ర్గ‌ ఆమోదం

అమ‌రావ‌తి  (CLiC2NEWS): రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రివ‌ర్గం స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు చేశారు. స‌మావేశానంత‌రం మంత్రి పార్థ‌సార‌థి మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిష‌న్ ముసాయిదా బిల్లుకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింద‌న్నారు. ఎపి జిఎస్‌టి 2024 స‌వ‌ర‌ణ‌, 2014-18 మ‌ధ్య నీరు, చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపుల‌కు కేబినేట్ ఆమోదం తెలిపింది.

క్యాబినేట్ నిర్ణ‌యాలు

ఎపి డ్రోన్ పాల‌సీకి కేబినేట్ ఆమోదం తెలిపింది.

పిఠాపురం ఏరియా డెవ‌లెప్ మెంట్ అథారిటి ఏర్పాటుఉ ఆమోదం

ఎక్సైజ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ ముసాయిదాకు, కుప్పం ఏరియా డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటి ల‌క్ష్యాల సాధ‌న‌

సిఆర్‌డిఎ ప‌రిధిని 8,352 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల‌కు పెంచుతూ ఆమోదం

సిఆర్‌డిఎ ప‌రిధిలోకి ప‌ల్నాడు, బాప‌ట్ల అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటి నుండి 154 గ్రామాలు

11 మండ‌ల్లోని 154 గ్రామాల‌ను తిరిగి సిఆర్‌డిఎ ప‌రిధిలోకి తెస్తూ ఆమోదం

జ్యుడిషియ‌ల్ అధికారుల ఉద్యోగ విర‌మ‌ణ వ‌య‌సు 61కి పెంపు

2024 న‌వంబ‌ర్ 1 నుండి అమ‌ల్లోకి వ‌చ్చేలా చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు ఆమోదం

Leave A Reply

Your email address will not be published.