రిజర్వేషన్ రోస్టర్ సమస్య సరిదిద్దాకే గ్రూప్-2 పరీక్ష..!

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 పరీక్ష వాయిదాకు సర్కార్ కట్టుబడి ఉన్నదని సిఎం చంద్రబాబు తెలిపారు. రోస్టర్ విధానంపై అభ్యర్థులు 3 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఎపి హైకోర్టు గ్రూప్-2 పరీక్ష వాయిదా ను నిరాకరించడంతో వీరు అందోళనకు దిగారు. రోస్టర్లో తప్పుల్ని సరిచేసిన తర్వాత మాత్రమే గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్ధులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్టి నేతలు విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల ఆందోళన మా దృష్టికి రాగానే సాధ్యాసాధ్యలు పరిశీలించామని.. కోర్టులో మార్చి 11న విచారణ దృష్ట్యా అప్పటి వరకు పరీక్ష వాయిదా వేయాలని ఎపిపిఎస్‌సికి లేఖ రాశమని సిఎం తెలిపారు. రిజర్వేషన్ రోస్టర్ సమస్య పరిదిద్దాకే పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ అభిమతమని సిఎం వివరించారు.