ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగం ఇచ్చేస్థాయికి ఎదగాలి: సిఎం చంద్రబాబు

అమరావతి (CLiC2NEWS): ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగం ఇచ్చేస్థాయికి ఎదగాలని, ఐదేళ్లలొ 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర కేబినేట్ సమావేశం ముగిసిన అనంతరం సిఎం మీడియాతో మాట్లాడారు. ఒకేసారి ఆరు కొత్త పాలసీలను తీసుకొచ్చామన్నారు. కొత్త పాలసీలు రాష్ట్ర ప్రగతిని మారుస్తాయని.. యువత భవిష్యత్తులో పెనుమార్పులు తెస్తాయన్నారు.
ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జి, గ్రీన్ ఎనర్జి, పాలసీలు తీసుకొచ్చామని.. పర్యాటక, ఐటి, వర్చువల్ వర్కింగ్ పాలసీలు తీసుకువస్తామని తెలిపారు. వన్ ఫ్యామిలి-వన్ ఎంటర్ ప్రెన్యూర్ నినాదంతో వెళ్తున్నామని.. ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగం ఇచ్చేస్థాయికి ఎదగాలని సిఎం అన్నారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఐదు జోన్లలో (విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ లేదా గుంటూరు, అనంతపురం ) ఐదు ఇన్నోవేషన్ రతన్ టాటా హబ్‌లు వస్తాయని సిఎం తెలిపారు. ఆధునిక టెక్నాలజిని ప్రజలకు మరింత చేరువ చేస్తామని, కొత్త పాలసీలతో రాష్ట్రంలోని పరిశ్రమలు అభివృద్ది చెందుతాయన్నారు.