నేను తెలుగువాడినని గర్వంగా చెప్పే రోజు వస్తుంది: సిఎం చంద్రబాబు

విజయవాడ (CLiC2NEWS): ‘జీతం కోసం ఆంగ్లం.. జీవితం కోసం తెలుగు’ నేర్పిస్తామని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా నగరంలోని తుమ్మల పల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన సభలో సిఎం మాట్లాడుతూ.. మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుందని.. భాషను మరిచిపోతే , జాతి కనుమరుగు అవుతుందన్నారు.
కూచిపూడి తెలుగాజాతి వారసత్వ సంపద అని.. కూచిపూడిని కాపాడే బాధ్యతను తీసుకుంటానన్నారు. అంగ్లం నేర్చుకుంటేనే జీవితం ఉందంటూ గత ప్రభుత్వ నేతలు మాట్లాడారని.. భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమేనని సిఎం అన్నారు. తెలుగు భాషను కాపాడతామని హామీ ఇస్తున్నా.. జీతం కోసం ఆంగ్లం .. జీవితం కోసం తెలుగు నేర్పిస్తామన్నారు. 2047 నాటికి దేశంలోనే ఎపి ప్రథమ స్ఆనంలో ఉండాలని కృషి చేస్తున్నామన్నారు. నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని సిఎం అన్నారు. ఈ కార్యక్రమలో డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.