AP: వైఎస్సార్‌కు ఎపి సిఎం జగన్‌ నివాళి

పులివెందుల (CLiC2NEWS): దివంగ‌త సిఎం, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల, వైఎస్ భారతి నివాళులర్పించారు.

కాగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ట్విట్ల‌ర్‌లో ఓ పోస్టు చేశారు వైఎస్ జగన్..

“నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జ‌న హృద‌యాల్లో కొలువై ఉన్నారు.చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ,చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది..“ అంటూ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.