AP: 144 ఆక్సిజ‌న్ ప్లాంట్లను ప్రారంభించ‌నున్న సిఎం జ‌గ‌న్‌..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 144 ఆక్సిజ‌న్ ప్లాంట్లను ముఖ్మ‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి సోమ‌వారం ప్రారంభించ‌నున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 426 కోట్ల వ్య‌యంతో ప్ర‌భుత్వాసుప‌త్రుల‌లో ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల‌ను ఏర్పాటు చేశారు. రూ. 20 కోట్లతో ఆక్సిజ‌న్ క్ర‌యోజ‌నిక్ కంటైన‌ర్‌ల‌ను కొనుగోలు చేశారు. 24.419 బెడ్ల‌కు ఆక్సిజ‌న్ పైప్‌లైన్ సౌక‌ర్యం క‌ల్ప‌స్తారు. మొత్తం 39 లిక్విడ్ మిడిక‌ల్ ఆక్సిజ‌న్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. క‌రోనాతో పాటు ఇత‌ర చికిత్స‌ల‌కు 20 అత్యాధునిక ఆర్టిపిసిఆర్ వైర‌ల్ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.