AP Corona: కొత్తగా 21,320 కేసులు.. 99 మరణాలు
అమరావతి(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 21,320 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 14,72,477కు చేరుకుంది.
తాజాగా వైరస్ బారిన పడి మరో 99 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 9,580 మంది మరణించారు. ఇదే సమయంలో 21,274 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 12,51,396 కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,11,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

