AP Corona: కొత్తగా 14,986 కేసులు.. 84 మరణాలు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 60,124 నమూనాలను పరీక్షించగా 14,986 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులిటెన్ విడుదల చేశారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,99,694 కేసులు నమోదయ్యాయి. ఇందునో 11,01,536 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,89,367 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.
జిల్లాల వారీగా మరణాలు
- పశ్చిమ గోదావరి 12
- గుంటూరు 12
- తూర్పుగోదావరి 10
- విశాఖ 9
- నెల్లూరు 8
- విజయనగరం 8
- చిత్తూరు 6
- కర్నూలు 6
- కృష్ణా 4
- శ్రీకాకుళం 4
- అనంతపురం 3
- కడప 3
మొత్తం రాష్ట్రంలో కరోనాతో 84 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 8791కి చేరింది.
