AP Corona: కొత్తగా 21,954 కేసులు.. 72 మరణాలు

అమరావతి (CLiC2NEWS): ఎపిలో కరోనా సెకండ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,10,147 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 21,954 కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,28,186 కు చేరింది. ఇందులో 10,37,411 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,82,329 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
కరోనా కారణంగా కొత్తగా 72 మంది మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 8,446 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,82,329 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,70,60,446 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
కొవిడ్‌తో విశాఖలో అత్యధికంగా 11మంది చనిపోగా, తూర్పుగోదావరి 9, విజయనగరం 9, అనంతపురం 8, ప్రకాశం 6, చిత్తూరు 5, గుంటూరు 5, కృష్ణా 4, కర్నూలు 4, శ్రీకాకుళం, 4, నెల్లూరు 2 మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 8,446కి చేరింది.
అత్యధికంగా తూర్పుగోదావరిలో 3,531 కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో అత్యల్పంగా 548 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో వెయ్యికిపైగా బాధితులు వైరస్ బారినపడ్డారు.