AP Corona: కొత్తగా 10,413 కేసులు

అమరావతి (CLiC2NEWS): ఎపిలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 85,311 నమూనాలు పరీక్షించగా 10,413 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 17,38,990కు పెరిగింది. కొత్తగా రాష్ట్రంలో కరోనా బారిన పడి 83 మంది మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 11,296కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 15,469 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 15,93,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,33,773కు యాక్టివ్ కేసులు ఉన్నాయి.
#COVIDUpdates: 04/06/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,36,095 పాజిటివ్ కేసు లకు గాను
*15,91,026 మంది డిశ్చార్జ్ కాగా
*11,296 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,33,773#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/7vaqEasFub— ArogyaAndhra (@ArogyaAndhra) June 4, 2021