AP Corona: కొత్త‌గా 109 మ‌ర‌ణాలు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో
రాష్ట్రంలో కొత్త‌గా 18,561 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ సోమ‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. రాష్ట్రం లో ఇప్ప‌టి వ‌ర‌కు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌ 14,54,052 కి చేరింది.

గ‌డిచిన 24 గంట‌ల్లో 109 మంది మృతిచెందారు. కోవిడ్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 9481 మంది మరణించారు. కొత్త‌గా రాష్ట్రంలో 17,334 మంది కోలుకున్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న‌వారి సంఖ్య 12,33,017కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 2,11,554 మంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.