Ap Corona: కొత్తగా 22,164 కేసులు.. 92 మరణాలు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యధిలో రాష్ట్రవ్యాప్తంగా 1,05,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 22,164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అలాగే కరోనా బారిన పడి చికిత్స పొందుతూ తాజాగా 92 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కరోనా లెటిన్‌ను విడుదల చేశారు.
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,87,603 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 8,707 కి పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుంచి 8,832 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలరో 1,90,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి.