AP Corona: కొత్తగా 24,171 కేసులు.. 101 మరణాలు
అమరావతి,(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 94,550 నమూనాలను పరీక్షించగా రాష్ట్రంలో కొత్తగా 24,171 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రం లో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,32,596 కి చేరింది.
జిల్లాల వారీగా
అనంపురం -14, విశాఖ -11, చిత్తూరు -10, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో 9 మంది నెల్లూరు -7, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, పశ్చిమగోదావరి -3, కడప -ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 101 మంది మృతిచెందారు. కాగా కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 9,372 మంది మరణించారు.
తాజాగా 21,101 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 12,12,788కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 2,10,436 మంది ఉన్నారు.

