AP Corona: తగ్గిన కేసులు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్తగా 8110 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ గురువారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఎపిలో ఇప్ప‌టి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,87,883 కు చేరింది.

గడిచిన 24 గంటల్లో ఏపీలో 12,981 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎపిలో మొత్తం 16,77 ,063 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 67 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 11763 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 99057 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.