AP Corona: తాజాగా 20 వేలకు పైగా కేసులు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,15,784 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా రాష్ట్రంలో కొత్తగా 20,034 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కరోనా వివరాలు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 11,84,028 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా బారిన పడి 82 మంది మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 8,289 మంది మరణించారు. ఇప్పటివరకూ కరోనా మహమ్మారి నుంచి మొత్తం 10,16,142 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,59,597 కరోనా ఆయాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.