AP Corona: భారీగా పడిపోయిన కేసులు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. కొత్త‌గా సుమారు 5 వేల కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్త‌గా 4,872 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ సోమ‌వారం క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,60,316 కు చేరింది.

గడిచిన 24 గంటల్లో ఏపీలో 13702 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. తాజా రిక‌వ‌రీల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 16,34,25 మంది కోలుకొని డిశ్చార్జ్  ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,14,510 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 86 మంది మృతి చెందారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు ఎపిలో కరోనాతో 11,552 మంది మృతి చెందారు.

జిల్లాల వారీగా మ‌ర‌ణాలు..

చిత్తూరులో 13మంది, గుంటూరు 10, అనంత‌పురం 9, శ్రీ‌కాకుళం 9, విజ‌య‌న‌గ‌రం 7, పశ్చిమ‌గోదావ‌రి 7, ప్ర‌కాశం 6, విశాఖ‌ప‌ట్ట‌ణం 6, తూర్పుగోదావ‌రి 5, కృష్టా 5, క‌ర్నూలు 5, నెల్లూరు 4 మ‌ర‌ణించారు.

 

Leave A Reply

Your email address will not be published.