AP Corona: 14,669 కేసులు.. 71 మరణాలు

అమరావతి(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించగా.. 14,669 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాబారిన పడి రాష్ట్రంలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.