AP Corona : తాజాగా 1,084 కొవిడ్ కేసులు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 57,345 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా తాజాగా 1,084 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు 20,49,314 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక 24 గంటల్లో 13మంది కరోనా మహమ్మారికి బలైయ్యారు. దీంతో మృతుల సంఖ్య 14,163 కి చేరింది. 1,328 మంది బాధితులు కొవిడ్నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,655 యాక్టివ్ కేసులున్నాయి.