AP Curfew: పొడిగింపు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్లో క‌రోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యం క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ర్ఫ్యూను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పెంచుతూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఉన్నతాధికారుల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించిన అనంత‌రం క‌ర్ఫ్యూ పొడిగింపుపై స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో క‌ర్ఫ్యూ విధించి 10 రోజులే అయింద‌న్న సిఎం.. ఫ‌లితాలు రావాలంటే నాలుగు వారాలు క‌ర్ఫ్యూ ఉండాల‌ని అభిప్రాయ‌పడ్డారు.

కాగా ఈ నెల 5వ తేదీన ఏపీలో క‌ర్ఫ్యూ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే కేసులు మాత్రం కంట్రోల్ అయిన ప‌రిస్థితి లేదు. దీంతో క‌ర్ఫ్యూను మరింత క‌ట్టుదిట్టం చేయాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెర‌గ‌కుండా జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని ఆదేశించారు. అలాగే బ్లాక్ ఫంగ‌స్ ను ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణయించారు.

Leave A Reply

Your email address will not be published.