సిఎం రేవంత్‌తో ఎపి డి.సిఎం పవన్ భేటీ

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తెలంగాణలో ఇటీవల కాలంలో భారీ వర్షాలకు నష్టపోయిన బాధఙతుల సహాయార్థం రూ. కోటి విరాళాన్ని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన చెక్కును ఇవాళ (బుధవారం) హైదరాబాద్‌లో సిఎం రేవంత్‌కు పవన్ అందజేశారు. అనంతరం ఎపి , తెలంగాణ మధ్య సత్సంబంధాలు, తదితర అంశాలపై సిఎం, డిప్యూటీ సిఎం మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.