పవన్‌కల్యాణ్ చిన్నకుమారుడికి ప్రమాదం.. సింగపూర్ బయలుదేరనున్న డిప్యూటి సిఎం

హైదరాబాద్ (CLiC2NEWS): ఎపి డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో శంకర్ గాయపడ్డాడు. అతని చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరినట్లు సమాచారం. అతనికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. 30 మంది చిన్నారులు సమ్మర్ క్యాంప్‌లో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ ఈరోజు రాత్రి 9.30 గంటలకు సింగపూర్ బయల్దేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం గురించి తెలిసినపుడు అది చిన్నదే అనుకున్నానని.. తర్వాత దాని తీవ్రత తెలిసిందన్నారు. పెద్ద కుమారుడు అకీరా పుట్టున రోజునాడు చిన్నకుమారుడికి ఇలా జరగటం బాధాకరమన్నారు. కుమారుడి ప్రమాదం గురించి తెలుసుకున్న తన భార్య షాక్‌లో ఉన్నట్లు తెలిపారు. ప్రమాదంలో తన కుమారుడి పక్కనే ఉన్న మరో చిన్నారి మృత్యువాత పడిందని.. ఆ విషయం బాధించిందని తెలిపారు. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన వారికందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కుమారుడి ఆరోగ్యం గురించి ప్రధాని నరేంద్ర మోడీ సైతం అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.