దేశం కోసం బలంగా నిలబడే యువత ఉంటే దేశం మారుతుంది: పవన్‌కల్యాణ్

పిఠాపురం (CLiC2NEWS): బలమైన దేశం కావాలంటే.. బలమైన ప్రజలు ఉండాలి. దేశం కోసం బలంగా నిలబడే యువత ఉంటేనే.. దేశం మారుతుందని డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం శివరులోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయాల్సి సమయమని.. భవిష్యత్తును నిర్మించే యువ నాయకత్వం కావాలన్నారు.
ఓ పార్టి పెట్టాలంటే నాన్న ముఖ్యమంత్రి అయిఉండాలా.. మామయ్య కేంద్రమంత్రి అయ్యిండాలా.. లేదా బాబాయిని చంపించి ఉండాలి అని ఎక్కడా రాసిలేదు కదా.. సమాజంపై అవగాహన లేకుండానే పార్టి పెట్టేస్తామా.. దశాబ్దం పాటు పార్టిని నడిపానంటే.. వ్యక్తి గత జీవితం నుండి ఆరోగ్యం వరకు ఎంతో కోల్పోయానన్నారు. సమాజంలో మార్పుకోసం వచ్చానని.. ఓట్ల కోసం కాదన్నారు. వ్యక్తిగా ఎదగాలంటే అధికారంమే ముఖ్యం.. దాని కోసం గూండాలను వాడుకుంటాం.. హత్యలు చేయిస్తాం.. కులాల మధ్య చిచ్చు పెట్టి లాభపడే పద్దతి వేరుంటది. అటాంటివి ఎంచుకోలేదని పవన్‌కల్యాణ్ అన్నారు.
నా జన్మ స్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రప్రదేశ్. నా తెలంగాణ కోటి రతనాల వీణ. తనక కరెంట్‌షాక్ కొట్టి చావుబతుకుల్లో ఉండగా.. కొండగట్టు అంజన్న ప్రాణాలు కాపాడరన్నారు. దాశరథి సాహిత్యం చదివి ప్రభావితమయ్యానని.. రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తాం.. అనే మాటలు నిజం చేశామన్నారు. బహుభాషలే దేశానికి మంచిదన్నారు. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలన్నారు.