జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలే: డిప్యూటి సిఎం
అమరావతి (CLiC2NEWS): విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (విబిఎఫ్ఎస్) ఆధ్యర్యంలో ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని గురువారం ఎపి డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసినసభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలేనన్నారు. తల్లిదండ్రుల వలన పుస్తక పఠనం అలవాటైందని, పుస్తక పఠనం లేకపోతో జీవితంలో ఏమయ్యేవాడినో అనిసిస్తుందన్నారు. ఈసందర్బంగా కృష్ణారావు రాసిన మాజి ప్రధాని పివి నరసింహారావు జీవిత చరిత్రం పుస్తకాన్ని పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు.
‘ఎవరికైనా రూ.కోటి ఇవ్వడానికి ఆలోచించను గానీ.. పుస్తకం ఇవ్వాలంటే మాత్రం ఆలోచిస్తానని పవన్‌కల్యాణ్ అన్నారు. పుస్తకం ఇవ్వాలంటే సంపద ఇచ్చినంత మథనపడతానని తెలిపారు. ఎవరైనా పుస్తకాలు అడిగితే.. తన దగ్గర ఉన్నవి ఇవ్వనని.. కొని ఇస్తానన్నారు. నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు’ అని పవన్‌కల్యాణ్ అన్నారు.
35 వ పుస్తక మహోత్సవంలో ఈ ఏడాది 270 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. జనవరి 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సుస్తక మహోత్సవం కొనసాగుతుందని విబిఎఫ్ఎస్ కార్యదర్శి మనోహర్ నాయుడు తెలిపారు.