టికెట్ కొనలేదు, అందుకే రూ.50లక్షల విరాళం ఇస్తున్నా.. పవన్ కల్యాణ్
![](https://clic2news.com/wp-content/uploads/2024/06/pawan-kalyan.jpg)
విజయవాడ (CLiC2NEWS): నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్‌టిఆర్ ట్రస్ట్ నేతృత్వంలో తలసేమియా బాధితుల కోసం యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎలాంటి ప్రచార హంగామా లేకుండా సేవ చేసుకుంటూ వెళ్లడం ఎన్‌టిఆర్ ట్రస్ట్ కు ఉన్న ప్రత్యేకత అన్నారు. మరో వందేళ్లపాటు ఇది కొనసాగాలని ఆకాక్షించారు. ఎన్‌టిఆర్ మన మధ్య లేకపోయినా ట్రస్ట్ ద్వారా గుండెల్లో ఉన్నారన్నారు.
ఎన్‌టిఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ పవన్‌కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఎంత సేపూ పనే కాదు.. సహాయ కార్యక్రమాల్లో వినోదం చైడొచ్చని ఈ మ్యూజికల్ నైట్ ద్వారా నిరూపించారన్నారు. నారా భువనేశ్వరిగారంటే తనకు అపారమైన గౌరవమని.. కష్టాలు, ఒడిదుడుకుల్లో చెక్కుచెదరకుండా బలమైన సంకల్పంతో ఉన్నారన్నారు. అలాంటి వ్యక్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమన్నారు. ఈ ఈవెంట్‌కు టికెట్ కొనమని చెబితే మావాళ్లు కొనలేదు.. ఈ విషయం తెలిసి, భువనేశ్వరి గారు మీరు టికెట్ కొనక్కర్లేదన్నారు. కానీ.. అందరూ టికెట్ కొని, నేను మాత్రం ఉత్తిగా రావడం తప్పుగా అనిపించిందన్నారు. అందుకు తన వంతుగా తలసేమియా బాధితుల చికిత్స కోసం త్వరలోనే రూ.50లక్షలు విరాళం ఇస్తానని పవన్ కాల్యాణ్ అన్నారు.