రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు కనిపించని దేవుళ్లు: పవన్‌కల్యాణ్
శ్రీహరికోట (CLiC2NEWS): రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు కనిపించని దేవుళ్లు అన్నారు ఎపి డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ . ఆయన మంగళవారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్సేస్ సెంటర్‌లో జరిగిన జాతీయ అంతరిక్ష ఉత్తవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. బాలీవుడ్ సినిమాకు అయ్యే ఖర్చుకంటే తక్కువతో రాకెట్ ప్రయోగాలు చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు నిజమైన హీరోలన్నారు.
శ్రీహరికోట సందర్శనతో తన చిన్ననాటి కల నెరవేరిందని పవన్ కల్యాణ్ అన్నారు. రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు కనిపించని దేవుళ్లుగా అభివర్ణించిన ఆయన.. యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలన్నారు. ప్రధాని మోడీ శాస్త్రవేత్తలకు అండగా ఉండటంతో ప్రయోగాలు విజయవంతం అవుతున్నాయన్నారు. అనంతరం అంతరిక్ష దినోత్సవపు కార్యక్రమాల పోటీల్లో విజేతలకు పవన్‌కల్యాణ్ బహుమతులు అందజేశారు.