ఇక నుండి రేషన్లో రాగులు, జొన్నల పంపిణీ..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో ఇక నుండి ప్రతినెలా రేషన్లో రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం మొదటగా రాయలసీమ జిల్లాల్లో అమలు చేయనుంది. పౌరసరఫరాల సంస్థ తొలిసారిగా చిరుధాన్యాలను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు జొన్నలు, రాగులు కొనగోలు చేస్తుంది. రైతులను చిరుధాన్యాల సాగువైపు ప్రోత్సహించేందుకు ఉత్పత్తులను కొనగోలు చేసిన వెంటనే నగదు చెల్లింపులు కూడా చేస్తోంది. ప్రస్తుతం రాగులను కర్ణాటక ప్రభుత్వం నుండి కొనుగోలు చేసింది.
రాయలసీమలో బియ్యం లబ్దిదారులకు ప్రతినెలా ఒక కేజి నుండి రెండు కేజీల మేర రాగులను అందించనున్నారు. చిరుధాన్యాల మద్దతు ధర కంటే మార్కెట్ రేటు ఎక్కువగా ఉండటంతో రైతులంతా ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే జొన్నలు ప్రైవేటు మార్కెట్కు తరలిపోయినందనున ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో జొన్నల సేకరణ నెమ్మదిగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 25 వేల టన్నుల రాగులను.. 500 టన్నుల జొన్నలు సేకరించినట్లు సమాచారం.