AP: 9వ తరగతి నుండి డిగ్రీ విద్యార్థుకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ..
`జగనన్న అమ్మఒడి`,- `జగనన్న వసతి దీవెన` పథకాల ప్రత్యామ్నాయంగా ల్యాప్‌టాప్‌లు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందజేయనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన కింద లబ్ధి పొందుతున్న విద్యార్థులకు ఆ పథకాలకు ప్రత్యామ్నాయంగా ల్యాప్‌టాప్‌లను అందించనుంది. విద్యార్థుల కోరిక మేరకు ఆ పథకాల కింద నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌లను అందించనుంది. 6.53 లక్షల మంది విద్యార్థులు ల్యాప్‌టాప్‌లు కావాలని కోరగా 6,53,144 ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎపిటిఎస్‌కు నోడల్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది.
ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి జగనన్న అమ్మఒడి కింద 44.48 లక్షల మంది తల్లులు లబ్ధి పొందుతున్నారు. వీరికి ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. వారిలో 5.42 లక్షల మందికిపైగా నగదుకు బదులు తమ పిల్లలకు ల్యాప్‌టాప్‌లు కావాలని ఆప్షన్ ఇచ్చారు. ఇక జగనన్న వసతి దీవెన కింద ఏటా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ.15 వేలు, డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం కింద 15.50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. లెనోవో, హెచ్‌పీ, డెల్, ఏసర్ వంటి బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ప్రభుత్వం అందించనుంది.ల్యాప్‌టాప్‌ల్లో ఏమైనా సమస్యలు వస్తే ఆయా కంపెనీలు వారం రోజులలో వాటిని పరిష్కరించేలా ప్రభుత్వం స్పష్టమైన వింధనలు విధించింది.