AP ECET-2022 ఫలితాలు విడుదల..
విజయవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎపిఇసెట్-2022 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో రెండవ సంవత్సరం (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాల కొరకు నిర్వహించిన పరీక్షల్లో బాలురు 91.44% ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 95.68% ఉత్తీర్ణత సాధించారు. జెఎన్‌టియు కాకినాడ ఆధ్వర్యంలో జులై 22వ తేదీన ఈ పరీక్షను నిర్వహించారు. 37వేల మంది విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో మొత్తం 92.36% ఉత్తీర్ణత నమోదైనట్లు హేమచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఎపిఐసెట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసినదే.