ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవపు వేడుకలు..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవపు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములకు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబిచేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు ఢిల్లీలోని ఎపి భవన్‌లో కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.