AP: మరోవారంలో జీన్ సీక్వెన్సింగ్ ల్యాబ్
ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు అంక్షలు మరింత కఠినంగా అమలు: జగన్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఎపిలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదయిన నేపథ్యంలో..రాష్ట్రంలోని కరోనా పరిస్థితులు, వైద్యారోగ్య శాఖపై సిఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. కొత్త వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు అంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. మరోవారం రోజుల్లో జీన్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పటు చేస్తామని అధికారులు సిఎంకు వివరించారు. ఈ నెలాఖరుకు 144 పిఎస్ఎ ప్లాంట్‌లు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. జనవరిలోగా వ్యాక్సినేషన్ డబుల్ డోస్ ప్రక్రియ పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాన్సర్‌తో బాధపడుతున్న వారకి సూపర్‌స్పెషాలిటి సేవలు అందాలని , మూడు ప్రాంతాల్లో కనీసం మూడు స్పెషాలిటి అసుపత్రులు ఉండాలని సిఎం అన్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం ఉండదు. వీరికిపూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించాలన్నారు.
108,104 వాహనాలు సమర్థవంతంగా ఉండాలని, నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావుండకూడదని , బఫర్ వెహికల్స్ పెట్టుకొని ఎప్పటికప్పుడు వాహనాల నిర్వహణ చూసుకోవాలని సిఎం వెల్లడించారు.