AP: గ్రామ పంచాయతీ సర్పంచులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
అమరావతి (CLiC2NEWS): గ్రామ పంచాయతీ సర్పంచులకు ఎపి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. 15 ఆర్ధిక సంఘం నిధుల వినియోగానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 5న చేసిన తీర్మానాల మేరకు నిధులు వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ తాజా నిర్ణయంతో పంచాయతీలలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు వేగవంతం కానున్నాయి. పనులు చేసి , మెజర్‌మెంట్స్ పుస్తకాల్లో నమోదు చేస్తే బిల్లులు చెల్లించవచ్చని తెలిపింది.