AP: చర్చలకు రండి.. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం పిలుపు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాలు కాంట్రిబ్యూటరి పింఛను పథకం (సిపిఎస్) రద్దు కోసం ఉద్యమం కొనసాగిస్తున్న విషయం తెలిసినదే. వారిని చర్చలకు మరోసారి రమ్మని రాష్ట్ర ప్రభుత్వం నుండి పిలుపొచ్చింది. ఈరోజు చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను మంత్రి బొత్స సత్యనారాయణ ఆహ్వానించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా సిపిఎస్ స్థానంలో గ్యారంటీ పింఛను (జిపిఎస్) అమనలు చేస్తామని ఇదివరకే ప్రభుత్వం తెలిపింది. అయితే దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే చలో విజయవాడ, మిలియన్ మార్చ్ సభల అనుమతికి ఉద్యోగ సంఘాలు ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి పిలుపురావడంపై ఉద్యోగ సంఘాలు సమావేశానికి వెళ్లాలా.. వద్దా.. అన్న సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదివరకే ఉద్యోగ సంఘాలు ఓపిఎస్ మినహా జిపిఎస్‌కు అంగీకరించేది లేదని ప్రభుత్వానికి, బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు.