బదిలీకోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త నందించింది. ఈ నెల 17వ తేదీ లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని సిఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఉద్యోగుల బదిలీల ఫైల్‌పై సిఎం సంతకం చేశారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఇప్పటివరకు నిషేధం కొనసాగుతూ వచ్చింది. ఆ నిషాధాన్ని సడలిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.