ఇక నుండి తెలుగులోనూ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు జారీ: ఎపి స‌ర్కార్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌ను తెలుగులోనూ జారీ చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భ‌త్వం నిర్ణ‌యించింది. ఇంగ్లిష్, తెలుగు భాష‌ల్లోనూ ప్ర‌భుత్వ‌ ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  ఈ మేర‌కు వివిధ శాఖ‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది. పాల‌నా వ్య‌వ‌హారాలు, ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు తెలుగులోనే జారీ చేసేందుకు గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ప్ర‌పంచ తెలుగు ర‌చ‌యిత‌ల మ‌హాస‌భ ఇటీవ‌ల తీర్మానించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు జారీ చేసేట‌పుడు ముందుగా ఇంగ్లీష్ లో ఉత్త‌ర్వులు ఇచ్చి ఆప్‌లోడ్ చేసిన అనంత‌రం రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్త‌ర్వులు జారీకి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ సూచించింది. ఉత్త‌ర్వ‌ల అనువాదానికి డైరెక్ట‌ర్ ఆఫ్ ట్రాన్స్‌లేష‌న్ సేవ‌లు వినియోగించుకోవాల‌ని తెలిపింది. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై క‌వులు, ర‌చ‌యిత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.